కడప పెద్ద దర్గాను టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి చినరాజప్ప శనివారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ముజావర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలని ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక్కరే సమర్థులని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, పలువురు నాయకులు పాల్గొన్నారు.