ఆన్ లైన్ మోసానికి గురైన ఓ మహిళ రూ. 10. 20 లక్షలు పోగొట్టుకున్న ఘటన కడప తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ ఉలసయ్య తెలిపారు. కడప అక్కాయపల్లెకు చెందిన సంధ్య ఆన్ లైన్ లో తొలుత రూ. 5 వేలు పెట్టుబడి పెట్టగా రూ. 10 వేలు ఇచ్చారు. రూ. 50 వేలు పెడితే రూ. లక్ష ఇస్తామని చెప్పడంతో వారి మాటలు నమ్మి ఆమె రూ. 50 వేలు పెట్టుబడిగా పెట్టారు. వారు రూ. లక్ష ఇవ్వలేదు. ఆ మొత్తం ఇవ్వడానికి ఆమె నుంచి వివిధ రూపాల్లో రూ. 9 లక్షలు రాబట్టారు. అయినప్పటికీ డబ్బులు వెనక్కు ఇవ్వకుండా ఆమెను మోసం చేశారు. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.