గుజరాత్‌లోని ఓ స్థానిక గాయనిపై నోట్ల వర్షం కురిసింది. ఇటీవల, గుజరాత్‌లోని కచ్‌లోని గాయని గీతా రాబరి కార్యక్రమం రాత్రంతా నడిచింది. ఆమె గొంతుకు మంత్రముగ్ధులైన ప్రజలు నాలుగు కోట్ల 50లక్షల రూపాయలను వెదజల్లారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గీతా రాబరి భజనలు, జానపద పాటలు పాడుతూ మంచి పేరు సంపాదించారు. ఆమె గుజరాత్ గానకోకిలగా అక్కడివారికి సుపరిచితురాలు.