తెలుగు మహిళ నేత మూల్పూరి సాయి కళ్యాణి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ యువనేత లోకేష్ అన్నారు. ఒక మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరించి పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చారన్నారు. వైసీపీ నేతల మెప్పు కోసం తప్పుడు కేసులు బనాయిస్తూ, మహిళలని చూడకుండా వేధిస్తున్న ప్రతీ ఒక్కరూ చట్టం ముందు నిలబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. కళ్యాణికి టీడీపీ అండగా ఉందని, మీకెవరు మద్దతు వస్తారో చూస్తామని లోకేష్ పేర్కొన్నారు.