మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.... చంద్రబాబు పాలనలో ప్రజలపై విద్యుత్ భారం పడకుండా చూశారని, ఏపీలో విద్యుత్ వాడుకొని పక్క రాష్ట్రాలకు అమ్మే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. జగన్‌కు మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని అప్పజెబితే లోటు విద్యుత్‌కు తెచ్చారని దుయ్యబట్టారు. జగన్ విద్యుత్ కొనుగోలులో రూ. 12 వేల కోట్లు కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.