ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డోన్ సబ్ స్టేషన్ ముందు టీడీపీ నేతల ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 10, 2023, 02:43 PM

పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు నంద్యాల జిల్లా డోన్ సబ్ స్టేషన్ ఎదురుగా ధర్నా కు దిగారు తెదేపా నేతలు. డోన్ మండల టీడీపీ అధ్యక్షుడు సలింద్ర శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రైతుల పొలాల్లో ఎన్నడూ లేని విధంగా మీటర్లు బిగించడం దారుణమని , అదేవిధంగా ఇష్టానుసారంగా విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అబ్బిరెడ్డిపల్లి గివింద్, రామ్మోహన్ యాదవ్, ఎల్ ఐ సి శ్రీరాములు, కన్నపకుంట మధు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa