నరసరావుపేట: జాతీయ రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 13న స్థానిక న్యాయస్థాన భవనాల్లో జాతీయా లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి జీవి నాగేశ్వరరావు సోమవారం పేర్కొన్నారు.