గుంటూరు నగరంలోని జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్ సోమవారం సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి వారి ఆరోగ్యం, ఆహార సదుపాయాలు తదితర అంశాలపై వివరాలు సేకరించారు. మే 13 నిర్వహించే జాతీయలోక్ అదాలత్ లో రాజీపడదగిన కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సిబ్బంది పాల్గొన్నారు.