అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ సచివాలయం -2 పరిధిలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు ఎంపీపీ గొర్ల సూరిబాబు మండల ప్రధాన కార్యదర్శి భీశెట్టి జగన్, స్థానిక సర్పంచ్ & ఎంపీటీసీ పాల్గొన్నారు.