పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం కి పరిరక్షణ కల్పించాలనీ ప్రజా సంఘాల నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ చిన్నియాదవ్, అబ్దుల్ కలాం సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ లు స్టేడియం ను పరిశీలించి మాట్లాడారు. అనకాపల్లి పట్టణానికి తలమాలికంగా ఉండవలసిన ఎన్టీఆర్ స్టేడియం స్టేడియం కు సరిపడా ఫోకస్ లైట్లు లేకపోవడం, స్టేడియంలో గ్రౌండ్ను కనీసం వారానికి ఒక్కరోజైనా తడపవలసి ఉండగా నెలైనా సరే తడపకపోవడం, గ్రౌండ్ను ఉన్న చెత్తా చెదారం నుశుభ్రం చేయకపోవడం, గ్రౌండ్లో అధిక సంఖ్యలో దోమలు ఉండడం, ఉదయం సాయంత్రం అధిక సంఖ్యలో వాకర్స్ ఉంటారని వారికి కనీస మౌలిక సదుపాయాలు ఉండవని, కనీసం మంచినీటి సదుపాయం కూడా లేకపోవడం, అంతేకాకుండా అధిక సంఖ్యలో కుక్కలు గ్రౌండ్స్ లో ప్రవేశించి వాకర్స్ పై దాడి చేయడం, అస్సలు గ్రౌండ్ పరీ రక్షణను జీవీఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలోఅంబేద్కర్ సేవాసమితి జిల్లా కోఆర్డినేటర్ బండి అప్పారావు, మత్స్యకారుల సంఘంనాయకులువాసుపల్లితాతయ్యలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బొబ్బిలి గోవిందరాజు, యాదవసంఘంనాయకులుబరిణికాన సూరిబాబు లు పాల్గొన్నారు