శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో ఓ మహిళ అక్రమంగా మద్యం నిలువ చేసిందనే సమాచారాన్ని అందుకున్న కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ బాల సూర్యరావు ఆదేశాల మేరకు సోమవారం సబ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి బలిఘట్టం గ్రామంలో గల జాగరపు కుమారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో కుమారి ఇంట్లో 60 మద్యం సీసాలను గుర్తించి, మద్యం నిల్వచేసిన మహిళను అలాగే మద్యం సీసాలను కొత్తవలస పోలీస్ స్టేషన్కు తరలించారు. నిల్వ ఉంచిన 60 సీసాల మద్యాన్ని స్వాధీనం చేసుకుని, జాగరపు కుమారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa