అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. లూయివిల్లోని ఓ బ్యాంకు భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కాల్పుల్లో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడు సైతం ఘటనలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈస్ట్ మెయిన్ స్ట్రీట్‌లోని ఓ భవనంలో కాల్పులు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ భవనంలోనే ఓల్డ్ నేషనల్ బ్యాంక్ కూడా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa