ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు బదిలీల కోసం గత 3 సంవత్సరాల నుండి వేచిచూస్తున్నారని, ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టిన తర్వాతనే డిఎస్సీ 1998 వారికి నియామకాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేసారు. ఈ మేరకు మంగళవారం అనంతపురంలో ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే బదిలీలు చేపట్టకపోవడం వల్ల ఉపాధ్యాయులు చాలా నష్టపోతున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa