దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమై, కాసేపటికే కోలుకొని లాభాల్లోకి ఎగబాకాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 60,274 దగ్గర, నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 17,771 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు పుంజుకొని 82.08 వద్ద ప్రారంభమైంది. టాటా మోటార్స్, HDFC బ్యాంక్, టాటా స్టీల్, ఎల్అండ్‌టీ, టైటన్, HDFC, అల్ట్రాటెక్ సిమెంట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.