కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా ఎంపికైన 71 వేల మందికి ప్రధాని మోదీ గురువారం వర్చువల్ విధానంలో నియామక పత్రాలను అందజేయనున్నారు. పది లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ‘రోజ్గార్ మేళా’ డ్రైవ్లో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్న ప్రధాని హామీ నెరవేర్చే దిశగా ఇదొక ముందడుగని పేర్కొంది.