దేశంలోని రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సారి నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ ఏడాది జులైలో ఎల్‌నినో ప్రభావానికి అవకాశముందని, అయినప్పటికీ జూన్-సెప్టెంబరులో సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దేశంలోని సాగుభూమిలో 52 శాతం వర్షాధారమైనందున వ్యవసాయానికి వర్షాలు ఎంతో ముఖ్యం. నైరుతి రుతుపవనాల కాలంలో 96 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.