మయన్మార్‌లో ఘోరం జరిగింది. ఆ దేశ సైన్యం సొంత ప్రజలపై దాడులు జరిపింది. మయన్మార్ వాయుసేన యుద్ధ విమానాల ద్వారా చేసిన ఈ బాంబు దాడుల్లో వంద మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నట్లు స్వతంత్ర మీడియా వెల్లడించింది. దేశంలోని సైనిక పాలనను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఓ కార్యక్రమంపై సైన్యం ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. దాడిలో మృతుల సంఖ్య 100కు చేరుకుందని స్వతంత్ర మీడియా వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa