బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పై FBI కీలక హెచ్చరికలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టవద్దని, సైబర్ నేరగాళ్లు USB కేబళ్ల ద్వారా మొబైల్ ఫోన్లలోకి మాల్ వేర్ ను ప్రవేశపెడుతున్నట్లు గుర్తించామని తెలిపింది. ఇలా వ్యక్తిగత, బ్యాంకింగ్ సమాచారాన్ని సేకరిస్తున్నారని హెచ్చరించింది. అంతే కాకుండా పబ్లిక్ ప్లేసెస్ లో వైఫై కనెక్ట్ చేసినప్పుడు ఆర్థికపరమైన లావాదేవీలు చేయొద్దని తెలిపింది.