జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని లడఖ్ ప్రాంతంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఆర్మీ జవాను మండ్లా ప్రసాద్‌బాబు అంత్యక్రియలు మంగళవారం సైనిక లాంఛనాలతో నిర్వహించారు. మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో సీతారామపురం లోని జవాను ఇంటి వద్దకు చేర్చారు. పలువురు ప్రజాప్రతినిధులు, బంధువులు, స్థానికులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మృతదేహాన్ని ర్యాలీగా శ్మశానవాటికకు తీసుకెళ్లి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపి నివాళ్లులర్పించారు. కార్యక్రమంలో ఆర్మీ అధికారులు, ఉదయగిరి సీఐ గిరిబాబు, ఎస్ఐ కిషోర్‌బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.