శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలోని ఒక ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్‌లో నకిలీనోట్లు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 29న రాత్రి పట్టణంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ మెషీన్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఓ బ్యాంక్ అకౌంట్‌కు రూ.44వేలు జమ చేశాడు. మొత్తం 88 రూ.500 నోట్లు ఉన్నాయి.. ఇవి ఫేక్‌గా నిర్ధారణ కావడంతో మెషిన్‌లో ఓ పక్కన ఉన్నాయి.
ఈ నెల 3న బ్యాంకు సిబ్బంది ఈ డిపాజిట్ మెషీన్ తెరవగా.. అందులో నకిలీ నోట్లు చూసి అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని మెనేజర్‌కు చెప్పారు. ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. ఆ తర్వాత టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఈ డబ్బులు ఎవరివ, ఎవరి బ్యాంకు అకౌంట్‌లోకి జమ అయ్యాయో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు తర్వాత క్లారిటీ వస్తుందంటున్నారు.
అంతేకాదు గతంలో కూడా నకిలీ నోట్లు ఇక్కడ బయటపడ్డాయి. ఓ వ్యక్తి టెక్కలి ప్రాంతంలో రూ.2000 నకిలీ నోట్లను ఒక మద్యం షాపు దగ్గర చెలామణీ చేయడం కలకలంరేపింది. అంతేకాదు కొంతమంది వ్యాపారుల దగ్గర నకిలీ నోట్లు బయటపడ్డాయి. దీంతో ఈ వ్యవహారంపై అప్పట్లోనే విచారణ చేశారు. ఇప్పుడు డిపాజిట్ మెషిన్‌లో దొంగ నోట్లు బయటపడటం కంకలంరేపుతోంది. వరుసగా ఫేక్ కరెన్సీ ఘటనలతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.