ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో విషాదం చోటు చేసుకుంది. కార్యకర్తలు బాణాసంచా పేల్చడంతో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు జరిగిన అగ్నిప్రమాదం చాలా దురదృష్టకరం. పటాకుల నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగి ప్రమాదం నుంచి తప్పించుకునే క్రమంలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందగా, 11 మంది తీవ్రంగా గాయపడడం బాధాకరమన్నారు. ఈ ప్రమాద దృశ్యాలు, ఘటనా స్థలం భయానకంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకోవాలని పవన్ సూచించారు.