తన భర్తను మొసలి నుంచి ప్రాణాలను తెగించి కాపాడింది. రాజస్థాన్లోని కరౌలి జిల్లాలో బన్నె సింగ్, విమల్ బాయి దంపతులు మేకలను పెంచుతున్నారు. రెండు రోజుల క్రితం ఇద్దరు మేకలకు నీళ్లు తాగించేందుకని చంబల్ నదికి వెళ్లారు. ఈ సమయంలో ఓ మొసలి అతని కాలిని పట్టుకోగా కేకలు వేశాడు. తన భర్తను విడిపించేందుకు ఓ కర్రతో మొసలిని కొట్టగా విడవలేదు. తర్వాత మొసలి కంట్లో పొడవడంతో విడిచిపెట్టింది. ఆమె సాహసంపై ప్రశంసించారు.