భారత్ లో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,158 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరింది. రోజు రోజుకు భారీగా కేసులు నమోదవుతుండడంతో అందరిలో కలవరం పెరుగుతుంది. ఇది ఫోర్త్ వేవ్ కు సంకేతామా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతా అలర్ట్ గా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని వైద్యులు తెలిపారు.