అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలంలోని కండ్రుం పంచాయతీ పరిధి కుజభంగి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం పిడుగు పడి ఓ గిరిజనుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం కుజభంగి గ్రామానికి చెందిన ఇద్దరూ యువకులు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులను మేతకు తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ పిడుగుల శబ్దంతో భారీ వర్షం కురిసింది. దీనితో ఇద్దరు యువకులపై పిడుగు పడటంతో కుజభంగి గ్రామానికి చెందిన జయం అనే గిరిజనుడు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో యువకుడు డొంబుకు తీవ్ర గాయాలతో అస్వస్థతకు గురయ్యాడు. దీనితో విషయం తెలుసుకున్న గ్రామస్తులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలతో ఉన్న డొంబును 108 అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పిడుగుపాటు గురై జయరాం మృతి చెందడంతో కుజభంగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.