ప్రకాశం జిల్లా కొమరోలు ఎంపీపీ కామూరి అమూల్య మార్కాపురంలో ఈ బీసీ నేస్తం పథకం ప్రారంభించేందుకు బుధవారం వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ తో ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ. కొమరోలులో ఒక డిగ్రీ కళాశాల కావాలని ఈ ప్రాంత విద్యార్థులు దూరం వెళ్లి చదవాల్సిన పరిస్థితి తలెత్తిందని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన సీఎం జగన్ కలెక్టర్ దినేష్ కుమార్ తో మాట్లాడి డిగ్రీ కాలేజ్ కు కావలసిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తోటి ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.