యానాం నియోజకవర్గ పరిధిలో పుదుచ్చేరి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 15 నుంచి జూన్ 14 వరకూ సముద్రంలో చేపల వేట నిషేధించినట్లు మత్స్య శాఖ ఏడీ దడాల గొంతియ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిషేధ రోజుల్లో చేపల వేటకు సముద్రంపైకి వెళ్లరాదని హెచ్చరిక చేసినట్లు తెలిపారు. యంత్ర బోట్లు, ఇంజిన్ నావలు, వలలు, వేట పరికరాలను సురక్షిత ప్రదేశంలో భద్రపరుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.