సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ఇంటింటా పర్యటించిన సీఎం జగన్ సైన్యం ప్రజా మద్దతు పుస్తకంలోని ఐదు ప్రశ్నలకు ప్రజల నుంచి సమాధానం కోరుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులూ మాట్లడుతూ... అందరూ మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నవరత్నాలు కొనసాగాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇదివరకెన్నడూ లేని రీతిలో గత 46 నెలలుగా సీఎం వైయస్ జగన్ సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా మేలు చేశారంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు ప్రశంసిస్తున్నారు అని తెలియజేసారు.