శ్రీకాకుళంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో డి.శ్రీనివాస్ మాట్లాడుతూ.... ఉద్యోగులు నెల రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. భీమవరం ధర్నాలో చైర్మన్ ఫణి పేర్రాజు మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డి.ఈశ్వర్, ఆర్టీసీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేత వై.శ్రీనివాసరావు మాట్లాడారు.