పెద్దకడబూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 132వ జయంతి వేడుకలు శుక్రవారం సీపీఎం, డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న, కేవీపీఎస్ మండల కార్యదర్శి ఆనందరాజు, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి దేవదాసు, దళిత సోమవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. దేశానికి ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa