రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించారు. సమాజంలో ఆధిపత్య ధోరణులపై అంబేద్కర్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు. వివక్షని రూపుమాపడానికి జీవితాంతం ఓ యుద్ధమే చేశారన్నారు. స్వేచ్ఛా, సమానత్వం, పౌరహక్కులు రాజ్యాంగం ద్వారా కల్పించిన మానవతామూర్తి అంబేద్కర్ మహాశయుడి ఆశయసాధనకి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. వివక్ష, పేదరికం లేని సమాజం నిర్మించుదామని నారా లోకేష్ పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa