భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు శుక్రవారం కడప జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ జయంతి వేడుకల కార్యక్రమంలో వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ పాల్గొని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు.
అంబేద్కర్ ఆలోచనలు రాబోయే తరాలకు కూడా మార్గదర్శకమని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేశారు. అంటరానితనం, అస్పృశ్యత, సామాజిక అసమానతలు పోగొట్టిన మహోన్నతమైన వ్యక్తిగా అభివర్ణించారు. రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు దిశానిర్ధేశకుడిగా చరిత్రలో నిలిచారని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితం అవుదామని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్. పి (అడ్మిన్) తుషార్ డూడి, ఏ. ఆర్ అదనపు ఎస్పీ ఎస్. ఎస్. ఎస్. వి కృష్ణారావు, ఏ. ఆర్ డి. ఎస్. పి రమణయ్య, ఆర్. ఐలు వీరేష్, సోమశేఖర్ నాయక్, ఆర్. ఎస్. ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.