టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఒక కర్మజీవి అని, కాళ్ళ బొబ్బలు పగిలాయని, కళ్ళల్లో నీళ్లు వచ్చాయన్నారు. లోకేష్ ఆంధ్ర ప్రజల కోసం పాదయాత్ర చేస్తున్నారని.. గొప్ప లీడర్ అని కొనియాడారు. తనకే ఇంత ఉంటే.. లోకేష్ కుటుంబ సభ్యులు ఎలా వున్నారోనని అన్నారు. లోకేష్‌తో తన కొడుకు మూడు రోజులు నడిచినందుకు కాళ్ళు నొప్పులు అంటున్నాడన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని, సక్సెస్ అయ్యారని.. ఆయన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని జేసీ స్పష్టం చేశారు.