ప్రకాశం జిల్లా, మార్కాపురం నియోజక వర్గ పరిధిలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి శుక్రవారం తెల్లవారుజామున మహా విష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనాలలో అతి ముఖ్యమైన గరుడ వాహనం దర్శించిన వారికి విజయం, కీర్తి, బలం సిద్దిస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు తెలిపారు. ఉభయదాత డాక్టర్ పచ్చళ్ల శరత్ చంద్ర, కుటుంబ సభ్యులు, పగలు ఉత్సవ దాత సుగ్రీవు వెంకట సత్యనారాయణ పూజలు నిర్వహించారు. వివేకానంద పాఠశాల విద్యా ర్థుల వేషధారణలు, ప్రదర్శనలు, సన్నాయి మేళం, మహిళా కోలాట బృందాలు, తెనాలి మస్తాన్ బ్యాండ్ తదితర కార్యక్రమాల నడుమ నగరోత్సవం వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, చైర్మన్ బాలమురళీకృష్ణ వాహన సేవలో పాల్గొన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పెనుగొండ కేశవరావు, ఈవో గొలమారి శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షించారు.