భారత రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ . ఐతే అయన జయంతి రోజే ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకి పాల్పడిందని ‘గీతం’ యూనివర్సిటీ కు సంబందించిన మతుకుమల్లి భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తండ్రి, దివంగత ఎంవీవీఎస్ మూర్తి ఈ యూనివర్సిటీని స్ధాపించారు. ‘పౌరుల అభివృద్ధే దేశాభివృద్ధి అని చెప్పిన మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. రాజ్యాంగ హక్కులు కల్పించిన అంబేడ్కర్ జయంతిని మనమందరం జరుపుకొంటుంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం అదే రాజ్యాంగాన్ని కాలరాస్తోంది. ఇప్పటికి మూడుసార్లు గీతం యూనివర్సిటీలోకి అర్ధరాత్రిపూట అక్రమంగా పోలీసు యంత్రాంగాన్ని పంపించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా...రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేకుండా దౌర్జన్యానికి పాల్పడటం ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.