గడప గడపకూ మన ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికి వివరిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందని వివరిస్తూ.. ప్రజా సర్వే చేపడుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడారు.