వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏలూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన పెద్ది శ్రీను కుటుంబానికి జరిగిన మంచిని వివరిస్తూ సీఎం జగన్ వీడియో ట్వీట్ చేశారు. ``పెద్ది శ్రీను కుటుంబానికి మన ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచినందుకు గర్వపడుతున్నాను. శ్రీనుకు దివ్యాంగ పెన్షన్ తో పాటు తన భార్య పేరుమీద భూపట్టా, వైయస్సార్ చేయూత, అమ్మఒడి ఇచ్చి వారి జీవితంలో, వెలుగులు నింపే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది`` అని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.