దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన కార్ల ధరలను మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు మే 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ తన కార్ల ధరల్లో సగటున 0.6 శాతం పెంచుతున్నట్లు సమాచారం. వివిధ మోడల్స్, వేరియంట్లకు అనుగుణంగా కారు ధరలు పెరగనున్నాయి. దీంతో వాహనదారులకు మరింత భారం కానుంది. దీంతో పాటు పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి ఎస్‌యూవీ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి.