పక్షులంటే మనుషులకు ప్రియనేస్తాలే. కానీ, ముట్టుకుంటే చాలు క్షణాల్లో ప్రాణాలు తీసే భయంకరమైన రెండు రకాల పక్షులు వాటి ఈకల్లో విషం దాచుకుంటున్నట్లు డెన్మార్క్ పరిశోధకులు గుర్తించారు. ఈ విషపూరిత పక్షులు రిజెంట్ విజ్లర్(పచీసెఫాలా స్లీకగెల్లీ), రఫోస్–నేప్డ్ బెల్‌బర్డ్(అలిడ్రియాస్ రుఫినుచా) అనే పక్షి జాతులకు చెందినవిగా వెల్లడించారు. ఇవి ఎక్కువగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో కనిపిస్తుంటాయని చెప్పారు.