ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనాలను ఆపి పత్రాలను తనిఖీ చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఓడ్రైవర్ లారీతో పోలీసులపైకి దూసుకెళ్లిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. జుంజుంను నగరంలోని గుద్దామోర్ కూడలి వద్ద పోలీసులు లారీకి అడ్డంగా నిల్చొని ఆపేందుకు యత్నించగా, లారీ డ్రైవర్ అలానే మీదకు దూసుకెళ్లాడు. పోలీసులు అప్రమత్తపై తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.