కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం నేతలు చేపట్టిన ప్రచార భేరీ కార్యక్రమం ఆదివారం పాయకాపురం పరిధిలోని కండ్రిక, ప్రకాష్‌నగర్, శాంతినగర్, రాజీవ్‌నగర్ ప్రాంతాల్లో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న బాబురావు, కోటేశ్వరరావులు మాట్లాడుతూ.... మోదీ పాలనలో అన్ని రంగాల వారు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని చెప్పారు. ధరలను అదుపుచేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. పెట్రో ఉత్పత్తుల ధర పెంపులో నెంబర్‌వన్‌గా దేశాన్ని మోదీ, రాష్ట్రాన్ని జగన్ నిలిపారని అన్నారు. మూడు రాజధానుల పేరుతో రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన పాపం మోదీ, జగన్‌లకే దక్కుతుందన్నారు. విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను పెంపు మోదీ, జగన్ జాయింట్ దుష్ట విధానాల ఫలితమేన్నారు.