నరసాపురం పట్టణంలో భారీ తరహాలో ఆన్లైన్ మోసం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... పట్టణానికి చెందిన బద్రీనాధ్ అనే వ్యక్తి హైద్రాబాద్‌లో ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. కొంత కాలంగా నరసాపురంలో ఉంటూ వర్క్‌ఫం హోంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 10తేదీన బద్రీనాధ్ వాట్సప్‌కు ఓ లింకు వచ్చింది. పార్ట్‌టైం జాబ్ అంటూ వచ్చిన ఈ లింకును ఆయన సరదాగా క్లిక్ చేసి చాట్ చేశాడు. లైన్‌లోకి వచ్చిన ఆన్‌లైన్ కేటుగాళ్ళు జాబ్ వివరాలను తెలియజేసి టాస్క్ పెట్టాడు. ముందుగా రూ.150 నుంచి మొదలైన ఈ టాస్క్ రూ.1000 నుంచి 2 వేలు, రూ.5 వేలు వరకు పెరిగింది. ఇలా పెద్ద మొత్తంలో గెలుచుకోవడంతో ఆ మొత్తాన్ని తన ఖాతాకు జమ చేయా లని బద్రీనాద్ కోరాడు. దీన్ని బదిలీ చేయాలంటే ముందుగా తమ ఖాతాల్లో కొంత మొత్తాన్ని వేయాలన్నారు. ఆలా మొదలుపెట్టి చివరికీ రూ.27లక్షల వరకు జమ చేయించుకున్నారు. చివరికీ తాను మోస పోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చ రించాడు. దీంతో కేటుగాళ్ళు అదృశ్య మయ్యారు. ఆ వెబ్‌సైట్ కూడా కనిపించలేదు. జరిగిన మోసాన్ని నరసాపురం పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడి నుంచి వివరాలను సేకరించారు.