సౌదీ అరేబియాలో ఉత్పత్తి అయ్యే హస్సవాయి రైస్ ఆరోగ్యానికి మంచిది. వీటిని రెడ్ రైస్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన అన్నం. అరబ్ ప్రజలు బిర్యానీ చేయడానికి ఈ బియ్యాన్ని ఉపయోగిస్తారు.ఇందులో ఎక్కువగా ఫినాలిక్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇందులో నీటిలో కరిగే విటమిన్స్, జింక్ ఉన్నాయి. ఫైబర్ కూడా ఉంటుంది. ఈ రైస్ ఫిట్‌గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ రైస్ వల్ల వృద్ధాప్యంలో కూడా దృఢంగా ఉంటారు.