నారా లోకేష్‌పై జగన్ సొంత మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా రాజోలు నియోజకవర్గ పరిధిలోని తాటిపాకలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... నంధ్యాల జిల్లా డోన్ నియోజకవర్గం జక్కసానిపల్లిలో దళితులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేష్ వ్యాఖ్యలను వక్రీకరించడం దారుణమన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు పెట్టిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుందన్నారు. దళితులకు సీఎం జగన్ చేసిందేమీ లేదు అన్న లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ సోషల్ మీడియా, జగన్ సొంత మీడియాలో ఒక్రీకరించి ఫేక్ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.