పొన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసిపి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల పింఛన్లను తొలగించారని వెంటనే వారికి పెన్షన్ మంజూరు చేయాలని మున్సిపల్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులతో కలిసి నిరసన ప్రదర్శన గావించారు. కార్యాలయ పనులకు అంతరాయం ఏర్పడుతుందని వెంటనే నిరసన కార్యక్రమం విరమించాలని అర్బన్ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీసులకు తెదేపా నాయకులకు వాదనలు జరగటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇరువురు మధ్య తోపులాట జరిగింది.