చిత్తూరులోని భాస్కర హోటల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్పంచుల సదస్సు నిర్వహిస్తున్నట్లు సర్పంచుల సంఘం అధ్యక్షుడు చుక్కా ధనుంజయ యాదవ్, కోకా ప్రకాశ్ నాయుడు పేర్కొన్నారు. సర్పంచుల అధికారాలను హరిస్తూ, నిధులను పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా చూస్తోందన్నారు. దీనిపై చర్చ జరిగే సదస్సుకు సర్పంచులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.