మాజీ మంత్రి ‘వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ చేయాలని కోరింది మా ముఖ్యమంత్రి జగనే. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్లు కచ్చితంగా బయటకు రావాల్సిందే’’ అని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు టీవీ చానెళ్లలో ప్రసారం అయ్యి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మధ్యాహ్నానికి మంత్రి సురేశ్ మరో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విలేకరులకు కూడా పంపారు. అందులో... ‘‘నా మాటలను వక్రీకరించారు. సీబీఐ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, విచారణ జరిపి అసలు దోషులను గుర్తించాలని చెప్పాను. భాస్కర్‌రెడ్డి అరెస్టు సరికాదని, దోషులెవరో తేల్చాలని చెప్పే కోణంలో వివరిస్తూ చట్టం తన పని తాను చేయాలని చెప్పాను. దీనిని వక్రీకరించి ప్రసారం చేయడాన్ని ఖండిస్తున్నా’’ అంటూ మంత్రి సురేశ్ వివరణ ఇచ్చారు.