కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నిరసిస్తూ సిపిఎం, సిపిఐ రాజకీయ ప్రచారంలో భాగంగా ఈనెల 21వ తేదీ రేపల్లెలో జరిగే ప్రచారం జయప్రదం చేయాలని పోస్టర్స్ ఆవిష్కరించారు. సోమవారం రేపల్లెలోని సిపిఎం కార్యాలయంలో పోస్టర్స్ ఆవిష్కరించిన అనంతరం సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి మణిలాల్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నాగాంజనేయులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందన్నారు.