తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు మాట్లాడటం తన మనసు గాయపరిచింది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారని.. అసలు తెలంగాణ ప్రజలను ఏమీ అనకపోయినా పవన్ తమపై నిందలు వేస్తున్నారని మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులను ఏదైనా అంటే పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఈ కొత్త బాధ ఎంటో అర్ధం కావడం లేదని అన్నారు. తెలంగాణకు చెందిన మంత్రి ఏపీ రాష్ట్రాన్ని అవమనిచేలా మాట్లాడితే మంత్రులు మాట్లాడతారని స్పష్టం చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ ది ఆంద్రప్రదేశ్ కాదా?.. రాజకీయం కోసమే ఆంధ్రప్రదేశ్ కావాలా?.. పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళకి లొంగిపోయాడా?’’ అంటూ వరుసగా ప్రశ్నలు సంధించారు.