పల్నాడు జిల్లాలోని 7 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందని మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తపరిచారు. 2024లో తిరిగి వైసీపీదే అధికారమన్నారు. వివేకా హత్యలో దోషులు ఎవరు ఉన్నా శిక్షించాల్సిందేనన్నారు. కేసుపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండగానే.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. చంద్రబాబుకి వయస్సు అయిపోయిందన్నారు. జ్ఞాపక శక్తి తగ్గిందన్నారు. చంద్రబాబు కారణంగానే రాష్ట్రానికి రాజధాని సమస్య ఏర్పడిందని పిన్నెల్లి పేర్కొన్నారు. 2024 ఎన్నికల తరువాత చంద్రబాబు,లోకేష్ తోకలు కట్ చేస్తామన్నారు.