బుచ్చయ్యపేట మండలం, కెపి అగ్రహారం గ్రామ సచివాలయం పరిధిలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామ సర్పంచ్ గోపిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన ఉమ్మడి జిల్లా జడ్పిటిసిల పోరం అధ్యక్షులు దొండా రాంబాబు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దేవర అప్పారావు యాదవ్ పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామంలో రైతు కూలీలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పనులు ద్వారా వ్యవసాయ భూములకు చిన్నచిన్న కాలువలు తవ్వడం, వ్యవసాయ భూములకు దారి ఏర్పాటు చేయడం, చెరువులను లోతు చేయడం లాంటి పనులు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేవర ముసిలి నాయుడు తోపాటు స్థానిక వైసీపీ నాయకులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.